Mobile Popup Ad
Mobile Popup Ad

ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం ఎప్పుడిస్తారు?.. హరీశ్ రావు ఫైర్

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు రేవంత్ సర్కార్ రూ. 18 వేల వేతనం ఎప్పటినుండి ఇస్తుందో చెప్పాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ఆయన అధికార పక్ష నేతలను ప్రశ్నించారు. కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్‌టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయని.. దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అని ప్రశ్నించారు. తమ హయాంలో తీసుకున్న చర్యల వల్ల ఐఎంఆర్, ఎంఎంఆర్ తగ్గి దేశంలో 3వ స్థానానికి చేరుకున్నామని.. ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాం? అని మండిపడ్డారు. సిద్దిపేట మెడికల్ కాలేజ్ పనులు 90 శాతం తమ హయాంలో పూర్తయ్యాయని చెప్పారు. మిగతా 10 శాతం పనులు రెండున్నరేళ్ళయినా పూర్తి కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>