Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ రాజధానిగా అమరావతి.. తీర్మానం చేయనున్న అసెంబ్లీ

కలం, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ ఈ నెల 28న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అమరావతి (Amaravati) ని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ శాసన సభ తీర్మానం చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దేశ ప్రజలందరికీ స్పష్టతనిస్తూ ఏపీకి అమరావతియే ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఈ తీర్మానాన్ని మంత్రి వర్గం ఆమోదించనుంది. అనంతరం ఈ అధికారిక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు పంపించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిపై ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే తుది నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే అతిముఖ్యమైన అంశం కనుక అధికార టీడీపీ, జనసేన ఎంపీలు తప్పనిసరిగా హాజరయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఈ ప్రత్యేక సమావేశం ద్వారా అమరావతి విషయంలో నెలకొన్న న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుందని కూటమి ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>