గుంటూరులో తెలుగు రాష్ట్రాల సీఎంలు సందడి… ఎందుకో తెలుసా?

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) బుధవారం గుంటూరులో సందడి చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు టీడీపీ సీనియర్ నాయకుడు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు.  ధూళిపాళ్ల కుటుంబంతో ఉన్న పాత పరిచయాలు, రాజకీయ బంధం దృష్ట్యా ఈ వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి  వెళ్లారు. గుంటూరు శ్రీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు.

మంత్రి నారా లోకేష్ సైతం ఈ వివాహానికి హాజరుకాగా.. వివాహ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని అప్యాయంగా పలకరించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి నూతన వధూవరులతో ఓ ఫోటోను దిగారు. అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. ప్రముఖు రాజకీయ నాయకుల రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>