కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) బీజేపీలో చేరడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ( MLA Beerla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడుతుంటే హరీశ్ రావు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని అనడం ఎంత వరకు కరెక్ట్ అని మండిపడ్డారు. అయిన ఆంధ్రావారితో హరీశ్ రావు వ్యాపారాలు చేయడం లేదా? అని నిలదీశారు.
అలాగే బీజేపీతో బీఆర్ఎస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah) ఆరోపించారు. ఎన్నికల్లో 8 సీట్లు గెలవడం వెనుక వారి అంతర్గత అవగాహన ఉందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కేటీఆర్ కూడా బీజేపీలోకి వెళ్లే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీశ్ రావు కేంద్రంలోని మోదీ, అమిత్ షాలతో మంతనాలు జరిపారని పేర్కొన్నారు.
Read Also: హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ ఇళ్లపై ఏసీబీ దాడులు
Follow Us On : WhatsApp

