ఆ సంస్థతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు, కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ కార్యాలయం (NTR Office) స్పందించింది. ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి లేదా అధికారిక ప్రకటనల పేరుతో సమాచారాన్ని విడుదల చేయడానికి ‘RAW NTR’ సంస్థకు ఎలాంటి అధికారం లేదని ఎక్స్ వేదికగా పేర్కొంది.

ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అధికారిక విషయాలపై ఎన్టీఆర్ లేదా ఆయన అఫిషియల్ టీమ్ మాత్రమే వెల్లడిస్తుందని కార్యాలయం పేర్కొంది. ఈ విషయంలో ఇదే తమ తరఫున తుది వివరణ అని స్పష్టం చేసింది.

అలాగే, సోషల్ మీడియా లేదా ఇతర వేదికల్లో జరుగుతున్న సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని ఎన్టీఆర్ కార్యాలయం (NTR Office) విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై కీలక ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కార్యాలయం ఈ స్పష్టీకరణ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: ‘రావు బహదూర్’కు సందీప్ వంగా స్టాండింగ్ ఒవేషన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>