హరీశ్ రావు వాగ్వాదం.. స్పీకర్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు గందరగోళం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ (Gaddam Prasad Kumar)  సభ ప్రారంభించిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సహా పలువురు సభ్యులు ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మీద పోలీసులు వ్యవహరించిన తీరుకి నిరసన తెలిపారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని, సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కారని ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో స్పీకర్‌తో హరీశ్ రావు (Harish Rao) వాగ్వాదానికి దిగారు.

దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ (Gaddam Prasad Kumar) స్పందిస్తూ.. ‘మీరు (హరీశ్) ఎందుకు ఆవేశపడుతున్నారు. మీ తల్లిని ఎవరు ఏమనలేదు కదా, నా తల్లిదండ్రుల గురించి అవమానకరంగా మాట్లాడారు. నాకెంత ఆవేదన ఉంటుంది. ఆవేశ పడాల్సింది నేను. నాకు ఏం సమాధానం చెబుతావ్ హరీశ్.. మీరు లొల్లి పెట్టినంత మాత్రాన నేను భయపడను’ అంటూ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిని తనకు అక్కా చెలెళ్లతో సమానమన్నారు. వారిని పోలీసులు ఇబ్బంది పెట్టారని తెలియగానే.. వెంటనే విచారణకు ఆదేశించానని వివరించారు.

నివేదిక రాగానే చర్యలు: శ్రీధర్ బాబు

సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి పనిచేసిన అనుభవం తమకు ఉందని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. వారిపై నిన్న పోలీసులు వ్యవహరించిన తీరుపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ, స్పీకర్‌కు జరిగిన అవమానానికి కనీసం బీఆర్ఎస్ పార్టీ నేతలు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయడం లేదన్నారు.

Also Read : ఎర్రవల్లిలో ఏం జరగబోతోంది..? కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద భారీ భద్రత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>