కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు గుండెపోటుతో మరణించారు. విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఆయన తీవ్రమైన గుండె నొప్పితో కుప్ప కూలిపోయారు. అటుగా వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి, సీపీఆర్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వెంటనే అసెంబ్లీ డాక్టర్లను పిలిపించారు. వారు సైతం సీపీఆర్, ఇతర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు తమతో కలిసి కలివిడిగా మాట్లాడిన వ్యక్తి మరణించడంపై అసెంబ్లీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

