తాతా మధు విచారణ.. బీఆర్ఎస్ నేతల ఆందోళన

కలం, వెబ్ డెస్క్: నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు (Tata Madhu), నవీన్‌రెడ్డి విచారణ ముగిసింది. ఇద్దరిని వైద్య పరీక్షల కోసం కింగ్‌ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీలను అరెస్ట్ చేశారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో కొంత సేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అరెస్ట్ అక్రమమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇద్దరి వాంగ్మూలాలు నమోదు..

తాతా మధు, నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి పలు అంశాలపై విచారించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో ఏసీపీ మట్టయ్య కేసును విచారిస్తున్నారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాతా మధు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నవీన్ రెడ్డిని కూడా విచారించిన, ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం వారిని కింగ్‌ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ సైతం పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>