మోటార్లు కాలిపోతున్నాయ్.. కరెంట్ కోతలపై న్యూ వెల్మల్ బొప్పారం రైతుల ఆగ్రహం!

కలం, సోన్: అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ బొప్పారం (New Velmal Bopparam) గ్రామ రైతులు మంగళవారం 33/11 కేవీ విద్యుత్ సబ్‌ స్టేషన్‌‌ను ముట్టడించారు (Farmers Protest). ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ పనులు స్తంభిస్తున్నాయని, పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న విద్యుత్ కోతలు మళ్లీ ఇప్పుడు ప్రారంభమయ్యాయని మండిపడ్డారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, తిరిగి వచ్చినప్పుడు హెచ్చుతగ్గులకు గురికావడంతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. ఒకవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత తగ్గిపోవడంతో పంటల సాగు కష్టంగా మారిందన్నారు.

బోరుబావుల నీటితోనే పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలు విధిస్తే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలపై అధికారులను ప్రశ్నిస్తే ఓవర్‌ లోడ్ కారణంగా పై నుంచి సరఫరా నిలిపివేస్తున్నారంటూ సమాధానం ఇస్తున్నారని తెలిపారు. వెంటనే కోతలను నిలిపివేసి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ (Farmers Protest) చేశారు.

Also Read : మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగారా? : సీతక్క

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>