6 గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రశ్నిస్తే నిర్బంధాలా?: వినయ్ భాస్కర్

కలం, హనుమకొండ బ్యూరో : ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులపై అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేసి అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు చేపట్టిన ఆందోళనలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన మాజీ చీఫ్‌విప్‌, బీఆర్‌ఎస్‌ నేత దాస్యం వినయ్‌ భాస్కర్‌ (Dasyam Vinay Bhasker) ను పోలీసులు ఆయన నివాసంలోనే హౌస్‌ అరెస్ట్‌ (House Arrest) చేశారు.

ప్రశ్నిస్తే నిర్బంధాలా?

ఈ సందర్భంగా వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ..హౌస్‌ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల గొంతును నొక్కలేరని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పిరికితనానికి తాజా పరిణామాలే నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్య హక్కులను హరిస్తారా?

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును కాలరాస్తూ ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడటం సరికాదన్నారు. ఎన్ని హౌస్‌ అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదని వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>