నా మీద కుట్ర జరుగుతోంది: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: తన మీద కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతోన్న సమయంలో హరీశ్ రావు అధికార పక్షం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రసంగించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు చదివి వినిపిస్తూ.. “బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు.. ఇది ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు” అని అన్నారని చెప్పారు. ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు ఈ బడ్జెట్ లో ఎక్కడ ఉన్నాయో చెప్పగలుగుతారా? అని ప్రశ్నించడంతో కాంగ్రెస్ సభ్యులు ఆయన ప్రసంగానికి ఆటంకం కలిగించారు. ఈ తరుణంలోనే తన ప్రసంగానికి సభ్యులు అంతరాయం కలిగించడంతో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

మేం చేసిన అప్పు రూ. 4 లక్షల 17 వేల కోట్లే..

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్బీఎమ్ లోన్, కాళేశ్వరం ప్రాజెక్టు లోన్, మిషన్ భగీరథ పథకం లోన్, కార్పొరేషన్ లో అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టే లోన్ లను కొలుపుకొని మొత్తం అప్పు తాము చేసింది రూ. 4 లక్షల 17 వేల కోట్లేనని క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఎప్పుడు, ఎక్కడ, ఏ టీవీ డిబేట్ కు అయినా, ప్రజల మధ్యలో అయినా, శాసన సభలోనైనా చర్చించడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు. గత సంవత్సరం, ఈ ఏడాదితో కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 3 లక్షల 70 వేల కోట్లు అని దుయ్యబట్టారు.

అప్పుల విషయంలో తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. తమ ప్రభుత్వం 1.65 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని హరీశ్‌రావు (Harish Rao) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రకటించిన రాజీవ్‌ యువవికాసం ఎప్పుడు అమలు చేస్తారో రేవంత్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని రెండు బడ్జెట్‌లలో చెప్పారని.. మూడో బడ్జెట్‌కు వచ్చేసరికి వడ్డీ లేని అనే పదం తీసేసి రుణాలు మాత్రమే అని పెట్టారని మండిపడ్డారు.

Read Also: అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీకి CM చంద్రబాబు భూమి పూజ.. లక్ష ఉద్యోగాలు వచ్చే ఛాన్స్

Follow Us On: Facebook

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>