యుద్ధానికి బ్రేక్: ట్రంప్ సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)  సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. మరో ఐదు రోజుల పాటు తాము యుద్ధం చేయబోమని స్పష్టం చేశారు. ఇరాన్‌పై తాత్కాలికంగా యుద్ధం ఆపేస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్‌తో (Iran) చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, ఇంధన క్షేత్రాలపై దాడులు ఆపేస్తున్నామన్నారు. ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ యుద్ధం ప్రభావంతో సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. వంట గ్యాస్ కొరతతో మన దేశంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. గత 24 రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లు మొత్తం స్తంభించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ (Trump) ప్రకటన భారీ ఊరట అని చెప్పొచ్చు.

Read Also: వేగంగా పెరుగుతున్న లంగ్ క్యాన్సర్.. కారణాలు చెప్పిన అధ్యయనం

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>