Mobile Popup Ad
Mobile Popup Ad

అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీకి CM చంద్రబాబు భూమి పూజ.. లక్ష ఉద్యోగాలు వచ్చే ఛాన్స్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన స్టీల్‌ కంపెనీ ఆర్సెలార్‌ మిత్తల్‌, నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా స్టీల్ ఫ్యాక్టరీకి (ArcelorMittal Steel Plant) కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈ కర్మాగారం నిర్మితమౌతోంది. ఏడాదికి 17.8 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 5,465 ఎకరాల్లో 2 దశల్లో ప్రాజెక్టు నిర్మాణం జరుగనుంది. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి లోకేష్, ఆర్సెలార్ అధినేత లక్ష్మీ మిత్తల్ (Lakshmi Mittal) ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత లక్ష్మీమిత్తల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసుకున్నామని.. దేశానికి తిరిగి ఇచ్చేందుకు చాలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆత్మనిర్భర భారత్, వికసిత్‌ భారత్‌ సాధనకు స్టీల్‌ చాలా ముఖ్యమైనదని చెప్పారు. మౌలికవసతుల నిర్మాణానికి స్టీల్ చాలా ముఖ్యమైనదన్నారు. ప్రతి రంగంలో స్టీల్ అవసరం చాలా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో తొలిదశలో 8.2 మిలియన్‌ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. ఈ స్టీల్‌ప్లాంట్‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముందుగా కేంద్రమంత్రి కుమారస్వామి(Kumaraswamy) రాజయ్యపేట చేరుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజయ్యపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరిని సంస్థ అధినేత లక్ష్మీ మిత్తల్, సీఈవో ఆదిత్యమిత్తల్ స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ ఆర్సెలార్ సంస్థ (ArcelorMittal Steel Plant) ప్రతినిధులను సీఎంకు పరిచయం చేశారు. రాజయ్యపేటలో ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను సీఎం సందర్శించారు. అలాగే స్టీల్‌ప్లాంట్‌ మోడల్‌ ను కేంద్ర మంత్రులతో సీఎం పరిశీలించారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ మోడల్‌ను సీఎంకు లక్ష్మీమిత్తల్ వివరించారు.

జగ్గయ్యపేట (Jaggaiahpeta)లో నిర్మితమౌతున్న స్టీల్‌ప్లాంట్‌ కు మొత్తం రూ.1,35,964 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. తొలి దశలో 2,600 ఎకరాల్లో రూ.80 వేల కోట్లతో నిర్మాణం జరుగనుంది. కర్మాగారాన్ని 2029 నాటికి నిర్మించి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. ఈ కర్మాగారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఆర్సెలార్‌ మిత్తల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ రెండు దశల్లో పూర్తి నిర్మాణం కానుంది. ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా క్యాప్టివ్‌ పోర్టును రూ.11,198 కోట్లతో నిర్మించనున్నారు. ఏపీకి ఏఎంఎన్‌ఎస్‌ ఇండియా రాకతో విశాఖ ప్రాంతం పరిశ్రమల హబ్‌గా మారనుంది. స్టీల్‌ప్లాంట్‌ను ఎన్‌హెచ్‌-16తో కలిపేలా 4 లేన్ల విస్తరణ పనులు సజావుగా సాగుతున్నాయి.

Read Also: అమెరికాతో యుద్ధం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>