వనపర్తిలో కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్టకు ముహుర్తం ఖరారు!

కలం, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల 11వ తేదీన కవయిత్రి మొల్లమాంబ (Mollamamba Statue) విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా భూమిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కుమ్మరులంతా కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరై కుల ఐక్యతను చాటాలని సంఘం నాయకులు కోరారు.

ఇందులో భాగంగా శనివారం కొత్తకోట, మదనపురం, ఆత్మకూరు మండల కేంద్రాల్లో సంఘం నాయకుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమంపై చర్చించారు. ఈ సమావేశాల్లో మండల అధ్యక్షులు సత్యం, శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నరేష్, యువజన సంఘం అధ్యక్షులు మేఘశ్యామ్, ఈశ్వర్ పాల్గొన్నారు. కౌన్సిలర్ పరుశురాం, సంఘం పట్టణ గౌరవ అధ్యక్షులు కొండన్న, మన్యం, తిరుపయ్య, రవి, నర్సింహులు, వాసు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>