రెడ్ బాల్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్

కలం, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల షమీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 64 టెస్టులు ఆడి 229 వికెట్లు తీసిన అతడు.. ఇకపై వన్డేలు, టీ20ల్లో కొనసాగనున్నాడు. షమీ చివరిసారిగా 2023 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత భారత జట్టుకు దూరమయ్యాడు. గాయాల కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు.

బెంగాల్ తరఫున తిరిగి బరిలోకి దిగి మంచి ప్రదర్శనలు చేసినా.. జాతీయ జట్టులో చోటు దక్కలేదు. టెస్టులకు వీడ్కోలు చెబుతూ షమీ (Mohammad Shami) భావోద్వేగ సందేశం పెట్టాడు. దేశం కోసం ఆడాలనే కలతో టెస్టు జెర్సీ ధరించానని, ప్రతి వికెట్, ప్రతి గాయం, ప్రతి పునరాగమనం తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని తెలిపాడు. తన ప్రయాణంలో అండగా నిలిచిన సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు కూడా ధన్యవాదాలు తెలిపాడు.

Also Read : పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై స్పందించిన ధనుష్​!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>