సీఎస్‌కేకి వరుణ్‌ని తీసుకోమని చెప్పా : హర్భజన్ సింగ్

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 దగ్గర పడుతోంది. ఈ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026 చివరి దశలో వరుణ్ కొంత ఇబ్బంది పడినప్పటికీ, రాబోయే ఐపీఎల్‌లో అతను బలంగా పుంజుకుంటాడని భజ్జీ ధీమా వ్యక్తం చేశారు. వరుణ్‌ను ఒక “ఛాంపియన్ బౌలర్”గా ఆయన అభివర్ణించారు. వరుణ్ ప్రతిభను తాను మొదటిసారి 2018లో చెన్నై సూపర్ కింగ్స్ నెట్స్ ప్రాక్టీస్ సమయంలోనే గుర్తించినట్లు హర్భజన్ (Harbhajan Singh) గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నెట్ బౌలర్‌గా ఉన్న వరుణ్, తన వైవిధ్యమైన బంతులతో దిగ్గజ ఆటగాళ్లను సైతం ముప్పుతిప్పలు పెట్టేవాడని తెలిపారు.

వరుణ్ బౌలింగ్‌కు ముగ్ధుడైన తాను, అతడిని వెంటనే జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు సూచించానని, అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదని వెల్లడించారు. తర్వాతి కాలంలో కేకేఆర్ జట్టులో చేరిన వరుణ్, 2024 టైటిల్ విజయంలో 21 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు 84 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసి తన సత్తా చాటారు. అంతర్జాతీయ స్థాయిలోనూ 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టడమే కాకుండా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి కూడా చేరుకున్నారు. వరుణ్ వద్ద ఉన్న నైపుణ్యం, పట్టుదల అతడిని మళ్లీ ఫామ్‌లోకి తెస్తాయని హర్భజన్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 19వ ఎడిషన్‌లో ఈ మిస్టరీ స్పిన్నర్ తన మ్యాజిక్‌ను పునరావృతం చేస్తాడని క్రికెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>