హనుమాన్ విగ్రహం ధ్వంసం.. హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత

కలం, వెబ్ డెస్క్: హనుమకొండ (Hanamkonda) జిల్లా న్యూ శాయంపేట సర్కిల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు హనుమాన్ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన హనుమాన్ భక్తులు, బజరంగదళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. న్యూ శాయంపేట ప్రధాన రోడ్డుపై దాదాపు గంటన్నర సేపు బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు.

విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించగా, ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేసి డీసీఎం వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read Also: బీజేపీలో కొత్త సంక్షోభం.. నేతలకు కీలక ఆదేశాలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>