భుజాలతోనే ‘స్ట్రెయిట్ డ్రైవ్’.. అంగవైకల్యాన్ని జయించిన క్రికెటర్

కలం, వెబ్‌డెస్క్: అంగవైకల్యం అనేది కేవలం శరీరానికే గాని సంకల్పానికి కాదని నిరూపించాడు ఓ యువకుడు. ఇష్టం, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చనే స్పూర్తిని యువతలో కలిగించాడు. చేతులు లేకపోయినా నిరాశ చెందకుండా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ అందరినీ ఆశ్చర్య పరిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ఈ వీడియోలో ఆ యువకుడు భుజాలతో బ్యాట్‌ పట్టి స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ కొడతాడు. సాధారణంగా స్ట్రెయిట్ డ్రైవ్ (Straight Drive) అనేది క్రికెట్ ఆటలో అత్యంత క్లాసిక్, అందమైన, సాంకేతికతతో కూడిన బ్యాటింగ్ షాట్. అయితే చేతులు లేకపోయినా భుజాలతో బ్యాట్ పట్టి అతను కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆటపై అతనికున్న మక్కువ, పట్టుదల అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు.

Read Also: కేటీఆర్ ఫోటోతో ఇంటి ఎలివేషన్.. అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్ అభిమాని వినూత్న భక్తి!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>