కలం, వెబ్ డెస్క్ : జనవరి నెల వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని స్కూల్ పిల్లలకి ఎక్కడ లేని సంతోషం. జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ అతి పెద్ద పండుగ. సంక్రాంతి పండుగకు వరుస సెలవులు వస్తాయి. ఉద్యోగులు సైతం సంక్రాంతి సెలవుల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే ఈ సారి జనవరిలో నెలలో ఆంధ్రప్రదేశ్ లోని స్కూల్స్ కి దాదాపు సగం రోజులు సెలవులే ఉన్నాయి.
10 వ తేదీ నుండి 18వ తేదీ వరకు 9 రోజులు సంక్రాంతి సెలవులు కాగా.. 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం మొత్తం గా 12రోజుల సెలవులు అన్నీ స్కూల్స్ వస్తాయి. ఇక నగరాల్లో CBSE సిలబస్ స్కూల్స్ కు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కి శనివారాలు సెలువు ఉండటంతో ఆ మూడు రోజుల సెలవులను కలుపుకొని ఏకంగా నెలలో సగం రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం 10 నుంచి 12 రోజులు సెలవులు ఉండనున్నట్లు తెలుస్తుంది.


