తెలుగులో తొలిసారి గళం విప్పి గానాలాపన చేసిన తెలుగింటి గాయని రావు బాలసరస్వతి(Bala Saraswathi) ఇకలేరు. బుధవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1928లో జన్మించిన ఆమె తనకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ఆకాశావాణి కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులను పరిచయం అయ్యారు. ‘సతీ అనసూయ’ సినిమాలో తొలి పాటను పాడారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం సహా పలు భాషల్లో ఆమె 2000కు పైగా పాటలు ఆలపించారు. అదే సినిమాలో గంగ పాత్రలో తన నటనను కూడా కనబరిచారు. 1944లో కోలంక జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను వివాహమాడారు. పెళ్ళి తర్వాత ఆమె నటనకు దూరంగా ఉన్నారు. 1950 దశాబ్దం మధ్య వరకు కూడా నేపథ్యగాయనిగానే కొనసాగారు.
Read Also: బాత్రూమ్‌లో మొబైల్ వాడితే పైల్స్ వస్తాయా..?

