జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills) బరిలో పోటీకి దింపే అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. పలువురు అభ్యర్థులను పరిశీలించిన తర్వాత మళ్ళీ లంకల దీపక్(Lankala Deepak Reddy) వైపు మొగ్గు చూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి విషయంలో బీజేపీ కూడా స్పీడ్ పెంచి.. దీపక్‌కు మరో ఛాన్స్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరుపున దీపక్ బరిలో నిలిచారు. కానీ, ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే లంకల దీపక్.. బుధవారమే తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్(Jubilee Hills) పోరులో త్రిముఖ పోటీ బలంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు కూడా ఎలాగైనా ఈ ఉపఎన్నికలో విజయం సాధించాలని చూస్తోంది. బీఆర్ఎస్ తన సత్తా చాటుకోవాలని చూస్తుంటే, బీజేపీ, కాంగ్రెస్.. జూబ్లీహిల్స్ పాగా వేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. బీఆర్ఎస్ మాత్రం సెంటిమెంట్‌ను ఆయుధంగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలో నిలిపింది.
Read Also : కాంగ్రెస్ ఓట్ చోరి.. కోర్టుకెళ్తామన్న కేటీఆర్

