కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల ధరలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మండలిలో ఆయన మాట్లాడుతూ మంత్రి దామోదర రాజనర్సింహకు కీలక సూచనలు చేశారు. జనరిక్ స్టోర్లు ఎక్కడో మూలన పెడతారని, ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు అవి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల లోపల ఉండే మెడికల్ షాపుల్లో మందుల ధరలకు (Medicine Prices) అదుపులేకుండా పోయిందన్నారు. దాన్ని నియంత్రించడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేదే పేద వాళ్లని, బయట ఆస్పత్రుల కంటే, జనరిక్ స్టోర్ల కంటే ధరలు ఎక్కువ ఉంటే ఎలా అని ప్రశ్నించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ధరలు నియంత్రించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. జనరిక్ మెడిసిన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు చైర్మన్ గుత్తా (Sukender Reddy) సూచించారు.
Read Also: పాక్‌లో చమురు సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలు!
Follow Us On: X(Twitter)

