పాక్‌లో చమురు సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, గ్యాస్‌ ధరలు!

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం (Middle East War) కార‌ణంగా ఏర్ప‌డుతున్న ప‌రిణామాలు ప్ర‌పంచ దేశాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయి. ఈ ఉద్రిక్త ప‌రిస్థితులు ప్ర‌పంచ ర‌వాణా వ్య‌వ‌స్థకు భారీ న‌ష్టాన్ని మిగిలిస్తున్నాయి. దీంతో ప‌లు దేశాల్లో చ‌మురు కష్టాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే భార‌త్‌లో గ్యాస్‌కు తీవ్ర కొర‌త ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా యుద్ధం కారణంగా పాకిస్తాన్‌ (Pakistan)లో చ‌మురు ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

గ‌త కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే చ‌మురు ధ‌ర‌లు ఏకంగా 200 శాతం పెరిగాయి. లీటర్ పెట్రోల్ (Petrol) ధర రూ.321, డీజిల్ ధర రూ.335, 11 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2,664కు పెరిగింది. ర‌వాణాకు ఇబ్బందులు ఏర్ప‌డ‌టం, దేశీయ నిల్వ‌లు త‌గ్గిపోవ‌డమే కార‌ణంగా ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. యుద్ధం మ‌రికొన్నాళ్లు ఇలాగే కొన‌సాగితే పాకిస్తాన్‌ (Pakistan)లో ప‌రిస్థితి మ‌రింత క‌ష్టంగా మారుతుంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Read Also: కొరత లేదంటూనే.. కోతలు, వాతలు

Follow Us On : WhatsApp

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>