కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో చికెన్ ధరలు (Chicken Price) నానాటికి పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.400కు చేరింది. అసలే ఎండాకాలం కావడంతో సరఫరా తగ్గిపోయింది. కోళ్లు కూడా ఎండలకు బతకడం లేదు. దీనికి తోడు ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ కూడా చికెన్ ధరలపై పడింది. నెలన్నర క్రితం వరకు రూ.220 రూపాయలకు కిలో ఉన్న చికెన్ ఇప్పుడు రెండింతలైంది. ఆదివారం వరకు రూ.350 దాకా పలికిన చికెన్ ఒక్కరోజు తేడాతోనే మరో 50 రూపాయలు పెరిగింది. రాను రాను మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక మటన్ రేట్లు 1000 మార్కును ఎప్పుడో దాటేశాయి. ప్రస్తుతం మటన్ కిలో 1200 పైనే పలుకుతున్నది.

