epaper
Tuesday, November 18, 2025
epaper

హైదరాబాద్‌లో ఉగ్రవాది అరెస్ట్.. భారీ కుట్ర భగ్నం

హైదరాబాద్‌లో ఉగ్రవాది డాక్టర్ సయ్యద్‌ మొయినుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్‌తో భారీ ఉగ్ర కుట్ర(Terror Plot) భగ్నమైంది. భారీ విషప్రయోగం చేయాలని ఉగ్రవాదులు పన్నాగాలు పన్నారు. కాగా మొయినుద్దీన్ అరెస్ట్‌తో ఆ ప్రయత్నం విఫలమైంది. పోలీసుల దర్యాప్తులో విస్తుబోయే విషయాలు వెల్లడయ్యాయి. సయ్యద్.. అత్యంత ప్రమాదకరమైన రెసిన్ విషాన్ని తయారు చేస్తున్నాడని అధికారులు గుర్తించారు. దేవాలయాలు, వాటర్ ట్యాంక్‌లలో దీనిని ప్రయోగించాలని వారు ప్రణాళికలు పన్నినట్లు అధికారులు వెల్లడించారు. అతడి అరెస్ట్ నేపథ్యంలో సయ్యద్ నుంచి విషం తయారీకి సంబంధించి ముడి పదార్థాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాద నేత ఆదేశాలతోనే మొయినుద్దీన్.. ఈ విషాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

సయ్యద్(Dr. Ahmed Mohiuddin) నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘ఇస్తామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్‌కు చెందిన నేత అబు ఖాదిమ్‌తో సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సయ్యద్.. చైనాలో ఎంబీీఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌లో వైద్య చికిత్సలు అందిస్తూ వచ్చారు. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలాల్లో కూడా పాల్గొన్నాడు. ఉగ్రవాదుల ఆర్థిక సహాయం అందించడం, కొత్త వారిని రెక్రూట్ చేయడం వంటి ప్లాన్‌లలో సయ్యన్ పాలుపంచుకున్నాడు. వారు పన్నుతున్న కుట్ర(Terror Plot)పై సయ్యద్‌తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులను కలిపి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: ఢిల్లీ పేలుడు ఘటన.. ఆ నగరం నుంచే ఉగ్రకుట్ర

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>