epaper
Monday, March 2, 2026
epaper

ప్రారంభమైన అందెశ్రీ అంతిమ యాత్ర.. పాల్గొననున్న సీఎం

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(Ande Sri) అంతిమ యాత్ర ప్రారంభమైంది. లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి ఘట్‌కేసర్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. తార్నాక, ఉప్పల్ మీదుగా ఆయన అంతిమ యాత్ర వెళ్లనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఆయన అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఘట్‌కేసర్‌కు బయలుదేరారు. కాసేపట్లో ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అందెశ్రీ పార్దీవ దేహానికి నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా అందెశ్రీ తుదిశ్వాస విడిచారు.

Read Also: ఢిల్లీ పేలుడు ఘటన.. ఆ నగరం నుంచే ఉగ్రకుట్ర

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!