కలం, వెబ్ డెస్క్: ఒక ఎత్తైన భవనంపై పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నత చదువులు చదివినా పెయింటర్‌గా ఎందుకు మారాడో ఆ వీడియోలో చెప్పాడు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. ఓ ఎత్తైన బిల్డింగ్‌లో పనిచేస్తుండగా సానియా మీర్జా అతడితో మాట్లాడే ప్రయత్నం చేసింది. ‘ఈ రంగంలో ఎంత సంపాదిస్తున్నావ్.. నీకు పని పట్ల ఆసక్తి ఉందా’ అడిగింది. పెయింటర్‌గా పనిచేయడంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదని, హాయిగా పనిచేసుకుంటున్నాని చెప్పాడు. నెలకు కనీసం రూ. 35000 సంపాదిస్తున్నానని, తాను డిగ్రీ కూడా చదివానని చెప్పడంతో సానియా షాక్ అయ్యింది.
తన సోదరుడు సైన్యంలో ఉన్నాడని, తన సోదరి బీహార్ (Bihar) పోలీస్ శాఖలో పనిచేస్తుందని తెలిపాడు. సమయం దొరికినప్పుడు వ్యవసాయం కూడా చేస్తానని చెప్పాడు. చెరకు అమ్మడం ద్వారా తాను ఏటా రూ. 10 లక్షలు సంపాదిస్తున్నానన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. “ప్రతి ఒక్కరూ జీతం ఎంత అని అడుగుతున్నారు. కానీ ఎవరూ అతడి కష్టాన్ని గుర్తించడం లేదు.” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకునే రిస్క్ కి వాళ్ళు చాలా సంపాదిస్తారని కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
Read Also: నా చివరి శ్వాస వరకు ప్రయత్నిస్తాను : నవీన్ పొలిశెట్టి
Follow Us On: X(Twitter)


