మహిళా వైద్యుల వేధింపులు.. ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నo

కలం, మెదక్ బ్యూరో : మహిళా డాక్టర్లు వేధింపులు భరించలేక నిద్ర మాత్రలు మింగి ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత కొద్ది కాలంగా ఏఎన్ఎం గా రజిని (ANM Rajini) విధులు నిర్వహిస్తోంది. మహిళా డాక్టర్లు మాసాయిపేట మండలానికి వెళ్లి అక్కడ ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని వేధింపులకు పాల్పడడంతో, మెట్ఫార్మిన్ మాత్రలు మింగి ఆసుపత్రిలోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే సహచర సిబ్బంది ప్రాథమిక వైద్యం చేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఏఎన్ఎం రజిని మాట్లాడుతూ… గత కొద్ది రోజులుగా ఇద్దరు మహిళా వైద్యులు  తన విధి నిర్వహణలో ఇబ్బందులు కలిగిస్తున్నారని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న ఉద్యోగం ఆధారంగా జీవిస్తున్న తాను వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా వైద్య శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇతర సిబ్బంది, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఎన్ఎం రజినిని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ ద్వారా మెదక్ (Medak) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: కాంట్రాక్టర్‌పై అధికారి దాడి.. వీడియో వైరల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>