ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక మలుపు… కేటీఆర్ అరెస్ట్ కానున్నారా?

కలం డెస్క్ : ఫార్ములా ఈ-కార్ రేసు(Formula E race) అవకతవకల వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తుకు, ఛార్జిషీట్ దాఖలుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో నిందితుడిగా ఉన్న కేటీఆర్(KTR) అరెస్టుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 53 కోట్ల మేర నష్టం చేకూర్చినందున ఆయనపై క్రిమినల్ చర్యలు తప్పవనే అభిప్రాయం నెలకొన్న సమయంలో కేటీఆర్ అరెస్టుపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ, శ్రేణులు ఆయనకు అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసే ఆలోచన లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని గతంలో పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీంతో కేటీఆర్ అరెస్టుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాలమే సమాధానం చెప్పనున్నది.

ఏసీబీతో పాటు ఈడీ ప్రాసిక్యూషన్ :

నిబంధనలను ఉల్లంఘించి ప్రజాధనం దుర్వినియోగం చేసినందున రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే నాలుగుసార్లు కేటీఆర్‌(KTR)ను విచారించింది. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ పురపాలక శాఖ పరిధిలోని అంశం కావడంతో దానికి అప్పట్లో మంత్రిగా పనిచేసిన కేటార్‌ను ఏ-వన్‌గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఏ-2గా ఏసీబీ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నది. కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఇంతకాలం జాప్యం జరిగింది. మరోవైపు ఫార్ములా ఈ-రేస్ విషయంలో అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్ఎండీఏ నుంచి నిధులను ఆన్‌లైన్ ద్వారా విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేసే సమయంలో నిబంధనల ప్రకారం రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకోకపోవడం, ఈ బదిలీ వెనక పరోక్షంగా కొన్ని సంస్థలు లబ్ధి పొందడంతో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ ఎంటర్ కానున్నది. ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ నుంచి విడిగా అనుమతి తీసుకోనున్నది. ఇప్పటికే ఒకసారి ఈడీ ఎంక్వయిరీకి కేటీఆర్ హాజరయ్యారు.

బండి సంజయ్ కవ్వింపు కామెంట్లు :

ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు. ఏసీబీ ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ ఆమోదం తెలిపినందున అడ్డంకులేవీ లేవని, బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు లోపాయకారీ ఒప్పందమే లేకపోయినట్లయితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌ను అరెస్టు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్(Bandi Sanjay) పరోక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు: సుప్రీం

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>