వాహనదారులకు గుడ్ న్యూస్: పెట్రోల్ పై భారీగా సుంకం తగ్గింపు

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని సామాన్య ప్రజలకు, వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాహనదారులకు ఇంధన ధరల నుండి ఉపశమనం కలిగిస్తూ, పెట్రోల్, డీజిల్ (Petrol Diesel) పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం పెట్రోల్‌పై లీటరుకు 13 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) 3 రూపాయలకు తగ్గించారు. అంటే లీటరుకు దాదాపుగా రూ. 10 తగ్గే అవకాశం ఉంది. అయితే డీజిల్ విషయానికి వస్తే గతంలో లీటరుకు 10 రూపాయలుగా ఉన్న సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా అంటే సున్నాకు తగ్గించింది. దీనివల్ల డీజిల్ ధరపై కూడా లీటరుకు 10 రూపాయల వరకు తగ్గే చాన్స్ ఉంది. అయితే ఇది వెంటనే అమల్లోకి రాకపోవచ్చు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు ఇరాన్ యుద్ధంతో తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు దీన్ని అవకాశంగా తీసుకోవచ్చు.

ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రవాణా రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది.

Read Also: సౌత్​ వర్సెస్​ నార్త్​.. ‘ఢీ’ లిమిటేషన్

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>