Mobile Popup Ad
Mobile Popup Ad

అల్లూరి జిల్లాలో కుప్ప కూలిన భారీ డ్రోన్!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలోని అల్లూరి సీతారామ‌రాజు (Alluri Sitharamaraju) జిల్లాలో ఓ భారీ డ్రోన్ (Drone) డ్రోన్ కుప్ప‌కూలింది. ఏజెన్సీ ప్రాంత‌మైన‌ జిమాడుగుల మండ‌లంలోని బొయితిలి దగ్గర ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెడ్ వింగ్ (Redwing) సంస్థకు చెందిన డ్రోన్ డ్రోన్‌ అదుపు తప్పి చెట్లలో పడిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్య‌వ‌స‌ర వైద్య పరీక్షల కోసం డ్రోన్‌ను వినియోగించేందుకు రెడ్ వింగ్ సంస్థ‌ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నది. ఈ క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు డ్రోన్ చెట్ల‌లో కూలిపోయింది. ఇలా ఎందుకు జ‌రిగింద‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. దీనిపై రెడ్ వింగ్ సంస్థ ఇంకా స్పందించ‌లేదు. ఏజెన్సీ ప్ర‌జ‌లు డ్రోన్‌ను ఆస‌క్తిక‌రంగా చూశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>