ఒక్కరి కోసం ఆలోచించొద్దు.. బీజేపీ అధిష్టానంపై రాజాసింగ్​ ఫైర్​​

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ బీజేపీ (BJP)లో జరుగుతున్న పరిణామాలపై గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే గ్రేటర్​ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక్క మేయర్​ పదవైనా గెలిచి చూపించండి అంటూ పార్టీ నాయ‌కుల‌పై సెటైర్లు వేశారు. సీనియర్​ నాయకులు మూడు మేయర్​ స్థానాలు గెలుస్తామంటూ చెప్తున్నారని, కనీసం కార్పొరేషన్​లో సగం సీట్లు అయినా గెలిచి చూపించాలని సవాల్​ విసిరారు. అసలు ఇప్పటి వరకు గెలిచిన కార్పొరేటర్లు ఏం చేస్తున్నారని రాజా సింగ్ ప్రశ్నించారు. ఈటల, బండి ఒక్కటైనంత మాత్రాన బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు.

బీజేపీలో చాలా మంది సీనియ‌ర్లు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉన్నార‌ని వాళ్ల ప‌రిస్థితి ఏమిట‌ని అధిష్టానాన్ని ప్ర‌శ్నించారు. నాయ‌కులు ఎవ‌రైనా స‌ర్ ప్ర‌క్రియ గురించి ఆలోచిస్తున్నారా? అని నిల‌దీశారు. బూత్ లెవెల్ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. నాయ‌కుల‌ ప‌ని తీరు చూస్తుంటే ఒక్క చోట‌ స‌గం కార్పొరేష‌న్ సీట్లు గెల‌వ‌డం కూడా క‌ష్ట‌మేన‌న్నారు. ఈ పోటీలో రామచంద‌ర్ రావు చాలా ఇబ్బంది ప‌డుతున్నార‌న్నారు. రాంచందర్​ రావును చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా చేస్తార‌ని నిల‌దీశారు. ఒక్క వ్య‌క్తి రామచంద‌ర్ రావుపై ఒత్తిడి చేస్తున్నార‌ని, అంతా తాను చెప్పిన‌ట్లే చేయాల‌ని ఆదేశిస్తున్నార‌ని, అందుకే రాంచంద‌ర్ రావు స్వ‌తంత్రంగా ప‌ని చేయ‌లేక‌పోతున్నార‌ని ఆరోపించారు. దీంతో రాజా సింగ్ (Raja Singh) ఆరోపించిన ఆ ఒక్క వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌ది హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: మహేశ్ టార్గెట్‌.. అర్బ‌న్ సీట్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>