Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్ఎస్ నేత మృతి.. న్యాయం కోసం పోలీస్ స్టేష‌న్ ఎదుట గ్రామస్తుల ధ‌ర్నా

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా గీసుగొండ (Geesugonda) మండలం గొర్రెకుంట గ్రామం బీఆర్ఎస్ అధ్యక్షుడు (BRS President) ల్యాద‌ళ్ల‌ రాజు అనుమానాస్పద మృతిపై న్యాయ విచార‌ణ చేయాలంటూ మృతుడి కుటుంబ స‌భ్యులు గీసుగొండ పోలీస్ స్టేషన్ మంగళవారం ధర్నా నిర్వహించారు. రాజు అనుమానాస్పద మృతిపై ఇంతవరకు పోలీసులు సరైన విచారణ చేయకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలలు గడుస్తున్నా.. మృతికి గల కారణాలు చెప్పడం లేదంటూ భాధితులు ఆవేదన వ్య‌క్తం చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదంటూ పోలీసులు దాటవేతదోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. మృతుడు రాజు ఒంటిపై అనుమానాస్పద గాయాలు ఉన్నా కూడా పోలీసులు హత్యగా భావించట్లేదని కుటుంబీకులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు సరైన విచారణ జరిపి బాధితులను శిక్షించే వరకు నిరసన తెలుపుతామంటూ కుటుంబీకులు హెచ్చరించారు.

Read Also: కక్ష ఉంటే నా మీద తీర్చుకొండి.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

Follow Us On : WhatsApp

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>