కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఏం చేసిందో మంత్రి సీతక్క (Seethakka) సమాధానం చెప్పాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో దానిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి.. ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మహిళలను మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమకు సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి సరికాదని విమర్శించారు.
Read Also: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. 48.79 కోట్ల నిధులు రిలీజ్
Follow Us On: Instagram

