కలం, వెబ్ డెస్క్ : హీరా గ్రూప్ (Heera Group) బాధితులకు ఊరటనిచ్చేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కీలక అడుగు వేశారు. గత కొంతకాలంగా అధికారుల కళ్లుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ అధినేత్రి నోవ్‌హీరా షేక్ (Nowhera Shaikh)ను ఈడీ ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. హర్యానాలోని గుర్గావ్‌లో తలదాచుకున్న ఆమెను టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేశారు.
గతంలోనే నోవ్‌హీరా షేక్ వెంటనే సరెండర్ కావాలని సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ గట్టిగా కోరడంతో, కొద్ది రోజుల క్రితమే నోవ్‌హీరా షేక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్‌పై స్టే తెచ్చుకోవడానికి ఆమె హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ప్రత్యేక బృందం, టెక్నాలజీ సాయంతో గుర్గావ్‌లో ఆమె ఉన్న లొకేషన్‌ను కనిపెట్టి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ అరెస్ట్‌తో హీరా గ్రూప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది.

