కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన (Gold Chain Theft) ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామానికి చెందిన గంగామణి అనే వృద్ధురాలు తన కోడలితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకు నిర్మల్ బస్టాండ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఖానాపూర్ వెళ్లే బస్సు ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును చాకచక్యంగా కత్తిరించి ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
కొంతసేపటి తర్వాత మెడలో గొలుసు కనిపించకపోవడంతో గంగామణి ఆందోళనకు గురైంది. అనంతరం అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తులం బరువున్న బంగారు గొలుసును దుండగులు అపహరించినట్లు (Gold Chain Theft) బాధితురాలు తెలిపింది. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Also: దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!
Follow Us On: Sharechat

