కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట (Suryapet) జిల్లాలో పట్టపగలే ఇళ్లలో చోరీకి (Daytime Robbery) యత్నించిన ఓ జంటను గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఇళ్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఒక మహిళ, ఒక పురుషుడిని స్థానికులు గమనించారు. వారి ప్రవర్తనపై అనుమానం కలగడంతో వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also: దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!
Follow Us On : WhatsApp

