లైంగిక వేధింపుల కేసు: ప్రముఖ మలయాళ దర్శకుడు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : మలయాళ చిత్ర పరిశ్రమలో మరో సంచలనం నమోదైంది. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌ (Ranjith Balakrishnan)ను కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఒక సినిమా సెట్‌లో తన పట్ల రంజిత్ అనుచితంగా ప్రవర్తించాడని, అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం కొచ్చి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో నటీమణుల భద్రతపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత వరుసగా వెలుగులోకి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ అరెస్ట్ ఇప్పుడు మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>