కలం డెస్క్: ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి (Anant Ambani) అరుదైన గౌరవం అందింది. ఆయనకు గ్లోబల్ హ్యూమన్ సొసైటీ (Global Humane Society).. గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డును అందించింది. ఆయన నిర్వహిస్తున్న ‘వంతారా’ (Vantara) వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చేసిన సేవలను గుర్తిస్తూ అమెరికాలోని గ్లోబల్ హ్యూమన్ సొసైటీ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న అనంత్, ఈ గౌరవం అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. అలాగే ఆసియాకు చెందిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్. కెన్నడీ, బిల్ క్లింటన్‌తో పాటు హాలీవుడ్ స్టార్‌లు షెర్లే మెక్‌లైన్, జాన్ వేన్, బెటీ వైట్ వంటి ప్రముఖులకూ ఈ అవార్డు లభించిన నేపథ్యంలో అనంత్ అంబానీకి (Anant Ambani) ఈ గుర్తింపు రావడం విశేషంగా నిలిచింది. వంతారా స్థాపన ద్వారా వన్యప్రాణుల పరిరక్షణలో కొత్త ప్రమాణాన్ని సృష్టించారని గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అధ్యక్షురాలు మరియు సీఈఓ డాక్టర్ రాబిన్ గాంజెర్ట్ ప్రశంసించారు. జంతువులకు అత్యుత్తమ వైద్యసదుపాయాలు, సహజ వాతావరణం, శ్రద్ధతో కూడిన సంరక్షణ అందించడంలో అనంత్ అంబానీ చూపుతున్న అంకితభావమే ఈ మహోన్నత గౌరవానికి కారణమని ఆమె పేర్కొన్నారు.
Read Also: హైదరాబాద్‌లో ఫ్లెమింగోలను చూసోద్దాం రండి!
Follow Us On: Instagram


