కలం, మెదక్ బ్యూరో : పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టిన నూతన డివిజన్ల విభజన అంశం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ (Ameenpur) మున్సిపాలిటీ ఆందోళనకు దారి తీసింది. 1,20,000 ఓటర్లకు పైగా కలిగిన అమీన్ పూర్ మున్సిపాలిటీలో కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేసి, తీవ్ర అన్యాయం చేశారని అన్ని పార్టీలు నాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. అమీన్ పూర్ మండల పరిధిలోని 8 పాత గ్రామాలతో కలిపి సుమారు 80వేల మంది ఓటర్ల కోసం కిష్టారెడ్డిపేట పేరుతో వెంటనే నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు
జిహెచ్ఎంసి పరిధిలో పలు చోట్ల 20 వేల ఓట్లకు సైతం డివిజన్ ఏర్పాటు చేశారని.. అమీన్ పూర్ (Ameenpur) అంశంలో కూడా ఇదే విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Read Also: మియాపూర్లో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
Follow Us On: Sharechat


