Mobile Popup Ad
Mobile Popup Ad

మియాపూర్​లో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

కలం, వెబ్​ డెస్క్​ : మియాపుర్​లో హైడ్రా (HYDRAA) భారీ ఆపరేషన్​ చేపట్టి రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మ‌హ‌బూబ్‌ పేటలో ఆక్రమణలను తొలగించింది. సర్వే నంబర్ 44 లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతున్నట్టు హైడ్రా ప్రజావాణికి గతంలోనే ఫిర్యాదు అందింది. దీంతో హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​ ఆదేశాల మేరకు గతంలోనే 5 ఎకరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మియాపూర్ – బాచుప‌ల్లి ప్ర‌ధాన ర‌హ‌దారికి స‌మాంత‌రంగా ఉన్న చెరువు క‌ట్ట‌పై 200ల మీట‌ర్ల మేర వేసిన 18 షట్టర్‌లను హైడ్రా గ‌తంలోనే తొల‌గించింది. తాజాగా మక్తా మహబూబ్ పేటలోని స‌ర్వే నంబ‌రు 44లోని ప్ర‌భుత్వ భూమికి సంబంధించి అక్ర‌మ రిజిస్ర్టేష‌న్ల‌తో పాటు.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు సంబంధించిన వార్తల నేపథ్యంలో మరోసారి హైడ్రా విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు హైడ్రా అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో శనివారం 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసి, హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.

Hydraa
Hydraa

Read Also: ఎన్నికలు వస్తేనే అభివృద్ధి గుర్తొస్తుందా..?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>