కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ హారర్ కామెడీ ఫాంటసీ మూవీ ” ది రాజాసాబ్ “(The RajaSaab). సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన ఈసినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన రాజాసాబ్ మూవీ చూశాక ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకి వచ్చామని ట్రైలర్‌లో చూపించిన చాలా సీన్స్ సినిమాలో లేకపోవడం నిరాశ కలిగించిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఫ్యాన్స్ రియాక్షన్స్‌కి దర్శకుడు మారుతి స్పందించారు. మూవీ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వలేదు. అలాగని సంతృప్తి చెందలేదు. ట్రైలర్ లో చూపించిన సీన్స్ లేకపోవడంతో ఇలా ఫీల్ అయ్యారని.. అందుకే సెకండాఫ్‌ని ఎడిట్ చేసి రూఫ్ ఫైట్ సీన్ యాడ్ చేశామని ఇది చాలా అద్భుతంగా ఉంటుందని మారుతి తెలిపారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రియల్ రాజాసాబ్ ని చూస్తారు అలాగే సోమవారం నుంచి నార్మల్ టికెట్ రేటుకే రాజాసాబ్ చూడొచ్చని మారుతి (Maruthi) వెల్లడించారు.
Read Also: అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్ అక్కినేని
Follow Us On: Sharechat


