సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు

కలం, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ కూల్చివేతల(GHMC Demolitions)తో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో, సికింద్రాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరాంఘర్, సికింద్రాబాద్  ప్రాంతంలో చిరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న షెడ్డులు, షాపులను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తొలగించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో తాము తొలగించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే తమకు కనీస సమాచారం ఇవ్వకుండా.. ముందస్తు నోటీసులు ఏవీ ఇవ్వకుండా తమ దుకాణాలు కూల్చేశారని.. తమ కడుపుకొట్టారని బాధితులు వాపోతున్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కొంతసమయం ఇస్తే మేమే స్వచ్ఛందంగా షాపులు తొలగించుకుంటామని వ్యాపారులు చెప్పినా అధికారులు వినిపించుకోలేదని వారు వాపోయారు.

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ (Monda Market) పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఉద్రిక్తత నెలకొంది. అక్కడ కూడా షాపులు కూల్చివేయడానికి వచ్చిన జీహెచ్ఎంసీ (GHMC Demolitions) అధికారులను వ్యాపారులు తీవ్రంగా ప్రతిఘటించారు. కూల్చివేతలను నిరసిస్తూ ఎదురు తిరిగిన వ్యాపారులు పోలీసులను, జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలతో అక్కడి జీహెచ్ఎంసీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అనంతరం వ్యాపారులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read Also: మధిరకు మరో ప్రాజెక్టు.. సమీకృత మండలాఫీసు..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>