5 రాష్ట్రాల్లో ఎన్నికలు.. తెలంగాణలో హాలిడే ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలోనే ఆయా రాష్ట్రాలకు పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న.. తమిళనాడులో ఏప్రిల్ 23న.. పశ్చిమ బెంగాల్‌ లో ఏప్రిల్ 23, 29న పోలింగ్ ఉండనుంది. ఇక ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సెలవు (Holiday) ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్‌లో పోలింగ్ రోజుల్లో ప్రత్యేక సెలవు ఇచ్చింది.

ఆయా రాష్ట్రాల్లో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లకు సెలవు వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు ఉంటుందని స్పష్టం చేసింది. అసోం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 9న హాలిడే ఇచ్చిన ప్రభుత్వం.. తమిళనాడు పోలింగ్ తేదీ ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్ పోలింగ్ తేదీ ఏప్రిల్ 23, 29న సెలవులు ఇచ్చింది.

Read Also: గుడ్ న్యూస్.. టెన్త్ స్టూడెంట్స్ కు అదనంగా 7 మార్కులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>