Private Colleges | ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని, బకాయిలు చెల్లించకపోతే కాలేజీలను నవంబర్ 3 నుంచి బంద్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు తేల్చి చెప్పారు. బకాయిలు చెల్లించడం కోసం ప్రభుత్వానికి తాము నవంబర్ 1 వరకు సమయం ఇచ్చామని ఆలోపు డబ్బులు జామకాకుంటే బంద్ బాట పట్టితీరుతామని తెలిపారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కాలేజీలు నడిపే పరిస్థితుల్లో లేవు.
Private Colleges | రూ.1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని కేవలం రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. నవంబరు 1 లోపు రూ.900 కోట్లు విడుదల చేయకపోతే.. 3 నుంచి నిరవధిక బంద్ చేస్తాం. నవంబరు 10వ తేదీ లోపు 2లక్షల మందితో సమావేశం నిర్వహిస్తాం. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని భయపెడితే ఊరుకునేది లేదు.. ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించం’’ అని రమేశ్ హెచ్చరించారు.
Read Also: రికార్డ్‌లు బద్దలు కొట్టిన కోహ్లీ..

