కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల వల్ల మనదేశంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనివల్ల కొన్ని రోజులు దేశంలో సిలిండర్ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు (Gas Booking) కొత్త గడువులు అమల్లోకి వచ్చాయని సోషల్ మీడియాలో వార్త కథనాలు వెలువడుతున్నాయి. పీఎంయూవై (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, డబుల్ సిలిండర్ కనెక్షన్లకు 35 రోజులు గడువు పెట్టారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై కేంద్రం స్పందించింది. సిలిండర్ బుకింగ్ గడువు పెంచలేదని స్పష్టం చేసింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చింది.
పాత నిబంధనల ప్రకారమే బుకింగ్ చేసుకోవచ్చని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయా సిలిండర్ల బుకింగ్ గడువును పెంచామన్నది అవాస్తమని వివరించింది. దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని.. ఎల్పీజీ సరఫరా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. రిఫైనరీల్లో ప్రస్తుతం ఉత్పత్తి పెంచినట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్‌కు ఉన్న నిబంధనలు అలాగే కొనసాగుతున్నాయని చెప్పింది. నిబంధనల ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు (Gas Booking) కనీసం 25 రోజుల గడువు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా కొనసాగుతుంది. ఈ నిబంధనలు కనెక్షన్ టైప్‌తో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.
Read Also: అసెంబ్లీలో ఇప్పసారాపై రచ్చరచ్చ.. రాకేశ్ రెడ్డిపై పొన్నం ఫైర్
Follow Us On: Facebook

