అసెంబ్లీలో ఇప్పసారాపై రచ్చరచ్చ.. రాకేశ్ రెడ్డిపై పొన్నం ఫైర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సభలో వాడివేడి చర్చ జరుతోంది. మద్యం పాలసీపై అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ సభ్యుల మాటల తూటాలతో సభ దద్దరిల్లుతోంది. సభలో అవమానకరంగా ఇందిరా గాంధీ పేరును బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రస్తావించారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేశ్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సభలో ఇందిరమ్మ పేరు ఎలా మాట్లాడుతారు.. తమాషా చేస్తున్నారా? అని మండిపడ్డారు. రాకేశ్ రెడ్డి మాటలు రికార్డ్ ల నుండి తొలగించాలన్నారు. సారా గురించి మాట్లాడేటప్పుడు ఇందిరమ్మ పేరు తీస్తారా? అని ఫైర్ అయ్యారు. మహిళలకు సంబంధించి అవమానకరంగా మాట్లాడారని.. ఇందిరమ్మ పేరు సారాకి సంబంధించి ప్రస్తావించినందుకు రాకేశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ తమ దేవత అని.. మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఇందిరాగాంధీ గురించి ప్రస్తావిస్తూ ఉక్కు మహిళా, దేవత అన్నారని గుర్తు చేశారు. బీజేపీ సభ్యుడికి ఇందిరమ్మ పేరు ప్రస్తావించే అర్హత ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకురాలు ఇందిరమ్మను అవమానించే విధంగా మాట్లాడినందుకు రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) క్షమాపణలు చెప్పాలని.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమంతా కోరుతున్నామని చెప్పారు. ఇందిరమ్మ పేద ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఇందిరాగాంధీ తమ ఆదర్శమూర్తి అని.. ఎన్నో పథకాలకు ఆమె పేరు పెట్టుకున్నామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై కరోనా లాంటి పరిస్థితులు వస్తాయని ప్రధాన మంత్రి ప్రకటనతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు క్యూలైన్ లలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని పొన్నం (Ponnam Prabhakar) చెప్పారు.

Read Also: పుకార్లు నమ్మొద్దు.. ఫుల్ ట్యాంకులు చేయించవద్దు: సీపీ సజ్జనార్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>