కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కోహీర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ల చోరీ స్థానికంగా సంచలనం సృష్టించినది. గ్యాస్ కొరతను క్యాష్ చేసుకునేందుకు దొంగలు రూట్ మార్చారు. కోహీర్‌లోనీ మనీషా గ్యాస్ ఏజెన్సీ గోదాంలో నుండి 82 సిలిండర్లు ఎత్తుకెళ్లారు.
ఈ మేరకు గ్యాస్ ఏజెన్సీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి గోడౌన్ లోని 50 కమర్షియల్ నిండు సిలిండర్లు, 32 ఖాళీ సిలిండర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. గ్యాస్ సిలిండర్ల చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: రాయచోటిలో కలకలం.. SP నివాసం వద్దే క్షుద్ర పూజలు!
Follow Us On : WhatsApp

