కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి (Rayachoti)లో క్షుద్ర పూజలు తీవ్ర కలకలం రేపాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నివాసం ఉంటున్న ఎస్పీ బంగ్లాకు అతి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పట్టణంలోని ఇనాయత్ ఖాన్ చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఈ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ముగ్గులు వేసి, మధ్యలో ఒక బొమ్మను ఉంచి, చుట్టూ దీపాలు వెలిగించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యంత రక్షణ ఉండే ఎస్పీ నివాస ప్రాంతం పక్కనే ఇలాంటి వింత చేష్టలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్షుద్ర పూజల వెనుక ఎవరి హస్తం ఉంది? ఏ కారణంతో ఇక్కడ పూజలు చేశారు? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Read Also: కోహీర్‌లో భారీ చోరీ.. 82 గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్లిన దొంగలు!
Follow Us On : WhatsApp

