విశాఖ రైల్వే జోన్ కల సాకారం: కేంద్రం గెజిట్ విడుదల

కలం, వెబ్‌ డెస్క్‌ : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (South Coast Railway Zone) ఏర్పాటుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన జోన్ జూన్ 1 నుండి అధికారికంగా అమలులోకి రానుంది. దీని పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, కొత్త విశాఖపట్నం డివిజన్లను ఖరారు చేశారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జోన్ కోసం 52 ఎకరాల భూమిని కేటాయించింది.

అయితే అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ మార్గాన్ని విశాఖ డివిజన్ నుండి తప్పించి రాయగడ డివిజన్ కు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ వృద్ధి దిశగా ఇది ఒక గొప్ప అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: మార్గదర్శి కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>